హోంపేజి
తల్లి తెలంగాణ పార్టీని రిజిస్టర్ చేయించినప్పటికీ ఫుల్‌టైం పాలిటిక్స్‌లోకి రావడానికి విజయశాంతికి ధైర్యం చాలడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు జీవిత చరిత్ర రాసుకోవాలని ఆమె అనుకుంది. శివభక్తురాలైన విజయశాంతి నిజాలనే రాస్తుందా అని సినీ జీవులు ఎదురుచూస్తున్నారు. ఇలా ఉండగా విజయశాంతి విరగబడి నటించిన నాయుడమ్మ సినిమా త్వరలో విడుదల కానున్నట్టు ఆ సినిమా నిర్మాత రామకృష్ణ చెబుతున్నారు. చాలాకాలంగా ల్యాబ్‌లో ఉండిపోయిన ఈ సినిమా విడుదల కానుండడం ఆమె అభిమానులకు శుభవార్తే. ఈ సినిమాలో విజయశాంతి రెండు పాత్రలు పోషించారు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే విజయశాంతి మరిన్ని సినిమాల్లో నటించే అవకాశముంది. అయితే ఈ సినిమా ద్వారా విజయశాంతి రాజకీయ జీవితం మెరుగుపడుతుందని పరిశీలకులు అంటున్నారు. మహిళలను ఈ సినిమా బాగా ఆకట్టుకోవడమే గాక తెలంగాణ మహిళలు ఆమె ఓటర్లుగా మారే అవకాశముందటున్నారు.
బాలకృష్ణ సినిమాకు విలన్ జీవి కథ!
విప్రో యువరాజు ప్రేమలో కొయిరాలా!












Click it and Unblock the Notifications