జయప్రద 'రాజ్యం' ఎక్కడ?

Jayapradha
ఒకనాటి హీరోయిన్ జయప్రద ప్రజారాజ్యం పార్టీలో చేరుతారన్న అభిప్రాయం నెలకొంది. జయప్రద చిరంజీవికి అనుకూలంగా ప్రకటనలు చేయడం వల్ల ఆ పరిస్ధితి ఉండవచ్చు. జయప్రద తెలుగుదేశం ద్వారా రాజకీయల్లోకి ప్రవేశించి రాజ్యసభ సభ్యురాలు కాగలిగింది. రాజకీయాల్లో మహిళా శక్తి ఏమిటో చాటుకోగలిగింది.

చంద్రబాబు నాయుడు ఆమెను రాజకీయంగా నిర్లక్ష్యం చేయడంతో ఆమె సమాజ్ వాది పార్టీలో చేరవలసి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఆమెకు ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ లోక్ సభ స్ధానం కేటాయించి గెలిపించుకున్న ఘనత ములాయం సింగ్ యాదవ్ ది. తనది కాని రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జయప్రదకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవగలనన్న నమ్మకం ఉండడంలో ఆశ్చర్యం లేదు.

సమాజ్ వాది పార్టీతో చిరంజీవి పార్టీ చేతులు కలిపితే బాగుంటుందని భావించిన జయప్రద ఆ దిశగా పావులు కదిపినట్టు తెలుస్తోంది. కానీ చిరంజీవి వైపు నుంచి సరైన ప్రతిస్పందన లేకపోవడంతో సమాజ్ వాది పార్టీ అలయెన్స్ ప్రతిపాదన నుంచి దాదాపు వెనుదిరిగింది. ఢిల్లీ రాజకీయాల మజా తెలుసుకున్న జయప్రద ప్రజారాజ్యంలో చేరి ఎంపీ అవుతుందా? సమాజ్ వాది పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి మళ్ళీ పోటీ చేస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+