సైఫ్ అలీ ఖాన్ తో కరీనా కపూర్ ప్రేమాయణం పెళ్లి దాకా వెళ్లే పరిస్థితి లేదట. ఈ మధ్య కాలంలో వీరిరువురు చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతుంటే అందరూ ముచ్చట పడ్డారు. తనను పెళ్లి చేసుకోవాలని సైఫ్ కరీనాను అడిగాడట. అయితే కరీనా అందుకు నిరాకరించిందని సమాచారం. ఫోనులో సైఫ్ పెళ్లి ప్రతిపాదన చేశాడని వినికిడి. భారత్ కు తిరిగి వచ్చిన వెంటనే ముఖాముఖి ఈ విషయం మాట్లాడుతానని ఆమె సైఫ్ తో చెప్పిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె గ్రీసులో యాష్ చోప్రా నిర్మిస్తున్న తషాన్ సినిమా షూటింగులో ఉంది. ఈ సినిమాలో కరీనా కపూర్ బికినీలో కనిపించబోతోందని వేడి వేది వార్త ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. తన అందాలను ఆరబోసేందుకు ఆమె కాస్తా సన్నబడిందట కూడా. సైఫ్ తో ప్రేమతోనే సరిపెట్టాలని, పెళ్లి దాకా వెళ్లకూడదని కరీనా అనుకుంటోందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.