చిరంజీవితో కెసీఆర్ రహస్య చర్చలు
టీఅర్ ఎస్ అధినేత చంద్రశేఖరరావు గురువారం సాయంత్రం గన్ మన్ లను, వ్యక్తిగత సహాయకులను తీసుకెళ్ళకుండా జూబిలీహిల్స్ లోని ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళి ఒక ప్రముఖ వ్యక్తితో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఆ ప్రదేశానికి డ్రైవర్ ర్ ను కూడా తీసుకెళ్ళలేదు. కుమారుడు రామారావే ఆయన కారును డ్రైవ్ చేశారు.
తెలుగుదేశం నాయకుడు దేవేందర్ గౌడ్ లేదా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఆయన వెళ్ళి ఉండవచ్చని భావిస్తున్నారు. దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్ళడానికి మరీ అంత రహస్యం అవసరం లేదని , ఆయన చిరంజీవి ఇంటికి వెళ్ళి రహస్య మంతనాలు జరిపి ఉంటారని సన్నిహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి పార్టీతో పెట్టుకోడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే చిరంజీవి నుంచి పిలుపు వచ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications