మోహన్ బాబు 'చిరూ కామెంట్స్....

అలాగే "ఇటీవల నేను 'పాండురంగడు' సినిమా చూశా. శ్రీకృష్ణుని రూపంలో బాలకృష్ణను చూసినప్పుడు అన్న ఎన్టీఆర్ జ్ఞప్తికొచ్చారు. యువ ఎన్టీఆర్ క్లిష్టమైన డైలాగుల్ని కూడా సునాయాసంగా చెప్పగలడు. కల్యాణ్‌రామ్ సినిమా 'అతనొక్కడే'కు నేనే క్లాప్‌కొట్టా. అది సూపర్‌హిట్టయ్యింది. 'హరే రామ్' కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా. నిజానికి 'హరే రామ్' టైటిల్‌ని విష్ణుతో చేసే సినిమా కోసమని నేనే రిజిస్టర్ చేయించా. నేను సిటీలో లేని సమయంలో విష్ణు ఫోన్‌చేసి కల్యాణ్‌రామ్ 'హరే రామ్' టైటిల్ అడుగుతున్నాడని చెప్పాడు. మరో ఆలోచన లేకుండా ఇచ్చేద్దామని చెప్పా. కల్యాణ్‌రామ్ చక్కని క్రమశిక్షణ వున్న నటుడు అతనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా" అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఆయన అన్న 'కొంతమంది లాగా మనం కుప్పిగంతులు వేయకూడదు', 'తాటాకు చప్పుళ్లకు మనం బెదరకూడదు' అన్న మాటలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. అవి చిరంజీవినీ, ఆయన అభిమానుల్నీ ఉద్దేశించే అన్నవని అంతా భావిస్తున్నారు.చిరంజీవి పార్టీ పెడుతున్న ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు చేయటం మోహన్ బాబుకే చెల్లిందని అందరూ అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
