విజయవాడలో పురంధరేశ్వరి పాగా?
రాజకీయ వినీలాకాశంలో తారాజువ్వలా దూసుకెళ్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరికి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నియోజకవర్గం సమస్య వచ్చి పడింది. అమె బాపట్ల నియోజకవర్గం రిజర్వు కావడంతో ఈసారి విజయవాడ స్ధానం నుంచి పోటీ చేయాలని ఆమె ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ విజయవాడ సిటింగ్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చాలా గట్టివాడు. ఆర్ధిక బలం కూడా పురంధరేశ్వరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అయితే రాజగోపాల్ కంటే సోనియా కుటుంబానికి పురంధరేశ్వరి ఎంతో సన్నిహితురాలు. ఆమెకు విజయవాడ స్ధానం కేటాయిస్తే రాజగోపాల్ మరో స్ధానం కోసం వెదుక్కోవలసి ఉంటుంది.
తన కంటే చాలా జూనియర్ అయిన పురంధరేశ్వరి సోనియా ఇంటి మనిషైపోవడం రేణుకా చౌదరికి కంటగింపుగా ఉంది. విజయవాడ లోక్ సభ స్ధానం మీద కన్నేసిన రేణుక తనదైన స్టైల్ లో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే పురంధరేశ్వరి టాలెంట్ ముందు ఆమె దిగదిడుపే కాబట్టి చివరికి ఏం జరుగుతుందో ఊహించవచ్చు.












Click it and Unblock the Notifications