బాలకృష్ణ ఆధ్యాత్మిక చిత్రం "పాండు రంగడు" పూర్తి కావడంతో ఆయన మళ్ళీ మాంసాహారానికి, డ్రింక్స్ కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం బాలకృష్ణ ఈ రెండిటికీ దూరంగా ఉన్న సంగతి వివిధ మాధ్యమాల ద్వారా మీకు తెలిసిందే. మహా నటుడు ఎన్టీ రామారావు కూడా పౌరాణిక పాత్రల్లో నటించేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉండే వారు. బాలకృష్ణ కూడా "పాండురంగడు" సినిమా షూటింగ్ జరిగినంత కాలం మాంసాహారానికి, ఆల్కహాల్ కు దూరంగా ఉన్నారు. "రామదాసు" సినిమాలో నటించేటప్పుడు నాగార్జున కూడా ఇవే నిబంధనలు పాటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మే 30 న "పాండురంగడు" సినిమా విడుదల కానుంది. ఈ సిని మా పనులు పూర్తయ్యాయి కాబట్టి బాలకృష్ణ తన రొటీన్ లోకి వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి కంకణం కట్టు కున్న బాలకృష్ణ వైఎస్ ను దెబ్బతీయాలంటే నాన్ వెజ్ తో పాటు రకరకాల ఆహారాది పానీయాలు తీసుకోవడం మంచిదేనేమో.