పులివెందుల టికెట్ కు ఆమె ఒప్పుకుంటే..

Vijayalaxmi
చివరికి పులివెందుల టికెట్ ను వైఎస్ సతీమణి విజయమ్మకే ఇచ్చేటట్టు ఉన్నారు. ఇప్పటి వరకు గృహిణిగానే జీవితం గడిపిన విజయలక్ష్మికి రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా, తన భర్త ప్రాతినిధ్యం వహించిన స్ధానం నుంచి నిలబడి గెలవడం ఆయనకు నిజమైన నివాళిగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ స్ధానాన్ని జగన్ కు ఇవ్వకుండా విజయలక్ష్మికి ఆఫర్ చేయడం ద్వారా అధిష్టానవర్గం తెలివిగా వ్యవహరించింది. ఒకవేళ విజయలక్ష్మి పోటీ చేయకపోతే ఆ స్ధానం బయటి వారికి వెళ్ళిపోతుంది.

వైఎస్ మరణం తర్వాత నానా యాగీ చేస్తున్న జగన్ వర్గాన్ని చెక్ లో పెట్టడానికి అధిష్టానవర్గం అనేక యుక్తులను ఉపయోగిస్తోంది. జగన్ కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి సిద్ధంగా ఉంది. కాకపోతే ఆయన చుట్టూ ఉండే వంది మాగధులు ఆ పదవి తీసుకోవద్దని, కేబినెట్ పదవి కోసం పట్టుబట్టమని సూచిస్తున్నారు. పులివెందుల నుంచి పోటీ చేయడానికీ వైఎస్ సతీమణి అంగీకరిస్తే కాంగ్రెస్ అధిష్టానవర్గం తన చదరంగం క్రీడలో విజయవంతమైనట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+