కాంగ్రెస్ హైకాండ్ ను జగన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ సొంత పార్టీ పెట్టుకుంటారని నిన్న కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. జగన్ శిబిరం కావాలనే అటువంటి వదంతులను వదిలిందని తెలుస్తోంది. కెసిఆర్ కే భయపడిన సోనియా జగన్ సొంతపార్టీ అంటే గజగజలాడిపోతుందని జగన్ శిబిరంలో ఉన్న మేధావులు ఆశిస్తున్నారు. ఈరోజు జగన్ పుట్టిన రోజు. అధిష్టానవర్గం ఈ రోజు జగన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని వీరు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు సాక్షి న్యూస్ చానల్ వార్తలను కాకుండా జగన్ కు అనుకూలమైన కథనాలను ప్రసారం చేస్తోంది.

జగన్ వైయస్ కు కొడుకు మాత్రమే కాదని, గొప్ప శిష్యుడని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అభివృద్ధి చేయగల దార్శనికుడు జగన్ ఒక్కడేనని వార్తాకథనాలు సాక్షి మీడియాలో వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న తరుణంలో జగన్ మాత్రమే పరిస్ధితిని అదుపులోకి తెస్తారన్న వాదనను హైకమాండ్ వద్ద జగన్ వర్గం విన్పిస్తోంది. రేపు జగన్ ఒక ముఖ్యమైన సంగతిని రాష్ట్ర ప్రజలకు అందించనున్నారని కూడా జగన్ బంధువులు జనంలోకి వదులుతున్నారు. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుంటే రాణించగలరా? ఆయన వాపును బలుపు అనుకుంటున్నారా? త్వరలో చాలా విషయాలు బయటికి వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+