రామోజీకి జగన్ సవాల్

రామోజీరావు చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తేవడానికి తన పత్రిక ద్వారా అడ్డదారులు తొక్కుతున్నారని జగన్ విమర్శించారు. "మీ టార్గెట్ ఎవరు? నేనా? సాక్షి మీడియానా? ముఖ్యమంత్రి గారా లేక కాంగ్రెస్ పార్టీయా" అని ఆయన ప్రశ్నించారు. ఈనాడు గుత్తాధిపత్యాన్ని సాక్షి ఎదుర్కొని టాప్ రేంజిలో ఉందని, అది తట్టుకోలేక ఈనాడు తన మీద తప్పుడు రాతలు ప్రచురిస్తోందని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడిలా బినామీ పేరుతో పత్రికను (ఆంధ్రజ్యోతి కావచ్చు) నడపడం లేదని, తాను ముందుండి పత్రికను నడిపిస్తున్నానని ఆయన రాసుకున్నారు. ఈనాడు విమర్శలు చదివి తాను మొదట రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నానని, కానీ అబద్ధపు ప్రచారాలతో విసిగిపోయిన తాను లోక్ సభకు పోటీచేయాలని మొండి నిర్ణయానికి వచ్చానని ఆయన రాసుకున్నారు. కడపలో తనను ఓడించే దమ్ముంటే రామోజీరావైనా, ఆయన మనిషి అయిన చంద్రబాబు నాయుడైనా బరిలోకి దిగవచ్చని జగన్ బస్తీ మే సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications