రామోజీ 'రాయబేరం'!

ఈ విషయం తెలుసుకున్న రామోజీరావు రోశయ్యకు ప్రచారం కల్పించడానికి ముందుకు వచ్చినట్టు చెబుతున్నారు. రోశయ్యను వ్యక్తిగతంగా కలిసి వైఎస్ హయాంలో తనను ఎలా వేధించిందీ వివరించనున్నట్టు తెలిసింది. పరస్పరం సహకరించుకునే విధంగా ఉభయుల మధ్య అంగీకారం కుదిరే అవకాశముంది. అయితే రామోజీరావంటే రోశయ్యకు కొన్ని భయాలు ఉన్నాయి. పబ్లిసిటీ కోసం ఆశపడితే ఉన్న గోచీ ఊడిపోతుందనే భయం ఆయనది.
మరో వైపు కెసీఅర్ తన సొంత చానల్ ను ప్రారంభించే యోచనలో ఉన్నారు. అందుకోసం ఆయన ఇప్పటికీ సీనియర్ జర్నలిస్టులతో మంతనాలు సాగిస్తున్నారు. తెలంగాణ జర్నలిస్టులను మాత్రమే కొలువుల్లోకి తీసుకుని, రవి ప్రకాష్ వంటి ఆంధ్రా జర్నలిస్టులను సలహాదారులుగా పెట్టుకోవాలని ఆయన చూస్తున్నారు.












Click it and Unblock the Notifications