అన్నం వండుకుంటున్న సత్యం రాజు

ఆ జైలుకు వెళ్ళిన కొత్తలో వంద గ్రాముల పులిహోర టిఫిన్ గా, చారు అన్నం లంచ్ గా రాజు బ్రదర్స్ తినేవారు. చక్కటి భీమవరం రొయ్యల కూరలు, కొర్రమీను చేపల పులుసులు ఇష్టపడే రాజు బ్రదర్స్ కు ఈ మూడు నెలలుగా పెద్ద కష్టమే వచ్చి పడింది. దివాళా తీసినట్టు ఎంత నటిస్తున్నా సత్యం రాజు సోదరుల ఆస్ధులు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా.
ఇప్పుడు రామలింగరాజుకు చంచల్ గుడా జైలులో ప్రత్యేక గది కేటాయించడంతో వారు సొంతంగా అన్నం వండుకోడానికి అవకాశం లభించింది. అన్న రామలింగరాజు గ్యాస్ స్టౌ మీద అన్నం వండుతుండగా, తమ్ముడు రామరాజు ఒకటి రెండు కూరలు వండుతున్నారు. రాజుల బాధలు వచ్చే వారంలో తీరాలని, వారికి బెయిల్ రావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications