సోనియా తలుపులు వైఎస్ ఒక్కరికే

మిగితా రాష్ట్రాల కాంగ్రెస్ అగ్ర నాయకులకు ఈ రెండు నెలల్లో సోనియా గాంధీ అపాయింట్ మెంట్ దొరకడం లేదట. మన రాష్ట్రం నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు ఈ మధ్య కాలంలో ఒకే ఒక్కసారి అమ్మగారి దర్శన భాగ్యం కలిగిందట.
వైఎస్ ఇప్పటికీ సోనియా గాంధీకి లక్కీ మస్కట్ గా ఉన్నారు. అందుకు ఏసు ప్రభువు కారణమో, ప్రజల ఆమోదం కారణమో స్పష్టంగా చెప్పలేం. డజనుకు పైగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు సూపర్ బాస్ అయిన సోనియా గాంధీ వైఎస్ కు ఇంత విలువ ఇవ్వడం నిజంగా తెలుగువారికి గర్వకారణం. తెలుగుప్రజల ఆత్మ గౌరవాన్ని ఎన్టీఆర్ తర్వాత నిలబెట్టినది వైఎస్ అని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు. తాజా పరిస్ధితి ప్రకారం అది నిజమేననిపిస్తోంది.












Click it and Unblock the Notifications