పీవీ నరసింహారావు అంటేనే గతంలో కలలో కూడా భయపడిన వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన మీద అభిమానం పెరిగింది. పీవీ బాగా బతికినంత కాలం రాజశేఖరరెడ్డిని రాజకీయంగా పైకి రానివ్వలేదు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శుక్రవారం అవిష్కరించారు. 13 లక్షల వ్యయంతో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసి తొమ్మిదడుగుల పీవీ విగ్రహాన్ని బంజారాహిల్‌సలోని రోడ్ నంబర్ టెన్‌లో అవిష్కరణ జరిగింది. ఆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...పీవీ హయాంలో దేశం అభివృద్ధిలో ప్రయాణించిందని, తెలుగువారు పీవీని చూసి గర్వపడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి పీవీ తనయులతో పాటు రాష్ట్ర మంత్రులు హాజరైయ్యారు.