వైఎస్ కు సొంత పార్టీ నుంచే ముప్పు!

వైఎస్ దురదృష్టమంతా కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేల ద్వారానే. గత ఎన్నికల్లో తనకు ఇష్టం లేని అభ్యర్ధులు కూడా వివిధ మార్గాల ద్వారా టికెట్లు తెచ్చుకుని కాంగ్రెస్ అభ్యర్ధులుగా గెలుపొందారు. ఈసారి 294 మందికీ తన చేతి మీదగానే టికెట్లు ఇవ్వాలని వైఎస్ పట్టుదలగా ఉన్నారు. అయితే టికెట్లు రాని సిటింగ్ ఎమ్మెల్యేలు వైఎస్ మీద పడగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ సొంత మనుషులను ఓడించడానికి వారు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ ముఖ్యమంత్రి కాకపోయారంటే అందుకు కారణం సొంత పార్టీ వారే అవుతారు. ఆ విషయం వైఎస్ కు బాగా తెలుసు. అయితే ఆయన జగమొండి. ఏది జరిగితే అది జరగనివ్వండి అని అనుకునే రకం. ఏం జరుగుతుందో రెండు నెలల్లోపే తేలిపోతుంది.












Click it and Unblock the Notifications