• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దొరకునా ఇటువంటి గవర్నర్!

By Santaram
|
Narasimhan
గత గవర్నర్ల కంటే మన గవర్నర్ బవిభిన్నంగా వ్యహవరిస్తున్నారు. గవర్నర్‌ ఎక్కాడ్‌ శ్రీనివాసన్‌ లక్ష్మీ నరసింహన్‌ తన పేరు చివర ఉన్న నరసింహ పదాన్ని సార్థకం చేస్తున్నారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన అన్ని అధికారా లనూ యధేచ్ఛగా వినియోగిస్తున్నారు. గవర్నర్‌ గిరీ అంటే రబ్బర్‌ స్టాంపు కాదని, రాష్ట్రానికి రాజ్యాంగ సంరక్షకుడు అని నిరూపించుకుంటున్నారు. గవర్నర్‌ పదవిలో ఉండేవారు రాజ్‌భవన్‌కు, విందులు, సమావేశాలకు మాత్రమే పరిమితం కాదని, క్షేత్ర స్థాయిలో ప్రజానీకం ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలు, కనీళ్ళు, కడగండ్లను ప్రత్యక్షంగా పరిశీలించి, పరీక్షిం చి తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవలసిన గురుతర బాధ్యత గవర్నర్‌ పై ఉందని రుజువు చేసుకుంటున్నారు. గవర్నర్‌గా ఉన్న వారు హాయిగా రాజ్‌భవన్‌ పట్టున ఉండక ఊర్లు తిరగ టం, జనం సమస్యలు తెలుసుకోవటం ఏమిటని కొందరు గుర్రుమంటున్నా తన పని తాను నిబ్బరంగా చేసుకు పోతు న్నారు. రాజ్యాంగ పరిరక్షకుడుగా, కేంద్ర, రాష్ట్రాలకు అనుసం ధాన కర్తగా సమర్థమైన రీతిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న్నారు.

గవర్నర్‌ తరచుగా నిర్వహించే సమీక్షా సమావేశాలు, సమా చార సేకరణతో అధికారుల్లో చలనం మొదలైంది. మంత్రులు, శాసనసభ్యులు ఏదైనా సమాచారాన్ని కోరినప్పుడు తమ వద్ద ఉన్నంత ఇచ్చి సరిపెట్టుకునే అధికారులు సైతం పూర్తి జాగరూకతతో గవర్నర్‌ వద్దకు వెళ్తున్నారు. ఆయన ఏ శాఖ విషయంలో ఏమి ప్రశ్నలు అడుగుతారో అంతు పట్టక పోవటంతో పూర్తి సమాచారాన్ని సేకరించి మరీ వెళ్తున్నారు. రాజ్యాంగ పరిరక్షకుడుగా గవర్నర్‌ కు పూర్తి అధికారాలున్నా గతం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కాదని ముందుకు వెళ్ళటం మంచిది కాదని, సర్కార్‌కు సమాంతరంగా వ్యవహరిస్తున్నా రన్న పేరు తెచ్చుకోకూ డదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు లాంటి వారు వ్యాఖ్యానించినా, పీసీసీ అధికార ప్రతినిధి ఎన్‌.తులసిరెడ్డి లాంటి వారు వెంటనే దాన్ని ఖండించారు. ఈ వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యల మాటను ఏమాత్రం పట్టించుకోకుండా నరసింహన్‌ తన పని తాను చేసుకుపోతున్నారు. ఆ మధ్య కాలికి కణితిని తొలగించుకు నేందుకు అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులను కాదని గాంధీ ఆస్పత్రికి వెళ్ళి అందరినీ ఆశ్చర్య చకితులను చేసిన గవర్నర్‌ పాలనా పరంగా అనేక ప్రయోగాలు చేస్తున్నారు.

నిఘా విభాగం అధికారిగా రాష్ట్రంలో సేవలు అందించిన నరసింహన్‌, జరుగుతున్న అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుం టున్నారు. తరచుగా బృందాల వారీగా వివిధ శాఖల ఉన్న తాధికారులను రాజ్‌భవన్‌కు పిలిపించి వివరాలు తెలుసు కుంటున్నారు. సమాచారం తెప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రానికి నివేదిక పంపించారని అప్పట్లో వార్తలు వచ్చినప్పుడు దానిపై ముఖ్యమంత్రి రోశయ్య స్పందిస్తూ అదంత పెద్ద విషయమేమీ కాదు లెమ్మన్నారు. వాస్తవానికి సర్కార్‌ నుంచి ప్రతినెలా రాజ్‌భవన్‌కు పాలనా పురోగతిపై నివేదికలు వెళ్తూనే ఉంటాయి.

జిల్లా పర్యటనలు..

గతంలో గవర్నర్లు ఎవరూ చేయని రీతిలో నరసింహన్‌ జిల్లాల పర్యటనలు మొదలెట్టారు. ఎక్కడికి వెళ్ళినా అధికారులతో సమీక్షలు నిర్వహించటం, ఇంకా సమయం ఉంటే ఆకస్మిక తనిఖీలు చేయటం వంటివీ చేస్తున్నారు. ఆ మధ్యసింహాచలం నరసింహ స్వామిని సందర్శించేందుకు వెళ్ళిన ఆయన జిల్లా అధికారులతో సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ మధ్య ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు రైతుల గోడు విని చలించిపోయి ప్రభుత్వంతో మాట్లాడి అప్పటికప్పుడు రూ.37 కోట్లు పరిహారంగా విడుదల చేయించటం ప్రభుత్వ వర్గాలలో చర్చనీయాంశమైంది. సాధారణంగా గవర్నర్ల పర్యట నల్లో ప్రజలు తమ గోడు వెళ్ళబోసుకునే అవకాశాలుండవు. రాష్ట్ర చరిత్రలో ఒక గవర్నర్‌ రైతుల సమస్యలపై స్పందించి క్షణం ఆలస్యం చేయకుండా ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం ఇప్పించిన సందర్భం మరొకటి లేదు.

ఏలూరులోనూ అంతే..

ఇటీవలే ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పా ల్గొనేందుకు వెళ్ళారు. తాను చెడ్డ గవర్నర్‌ నని, నెలకు మూడు రోజులు గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుని సర్కార్‌కు తెలియజేస్తానని చెప్పేసరికి అదే వేదికపై ఉన్న మంత్రి రఘువీరారెడ్డి తదితరులు, స్థానిక ఎమ్మెల్యేలు నోరు మెదపలేని పరిస్థితి ఎదురైంది. అంతటితో ఊరుకోకుండా ఆయన జిల్లా అధికారులను అక్కడికే పిలిపించి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు, వాటి పరిష్కారా నికి చేస్తున్న ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల బాగోగులు తెలుసుకున్నారు.

ఇప్పుడు అనంతపురం వంతు..: ఈసారి అనంతపురం జిల్లా వంతు వచ్చింది. సత్య సాయిబాబా ఆశీస్సుల కోసం పుట్టపర్తికి వచ్చానని చెప్పిన ఆయన, ఆ కార్యక్రమం అనంతరం జిల్లా అధి కారులను తన అతిథి గృహానికి పిలిపించుకుని జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై పూర్తి స్థాయి సమాచారం రాబట్టారని జిల్లా నుంచి వార్తలు వచ్చాయి.

తెలుగు భాష అనుకూల అంశం..: రాష్ట్రంలో పని చేసి వెళ్ళిన నరసింహన్‌కు తెలుగు భాష అన ర్గళంగా రాకపోయినా ప్రజలతో సంభాషించి వారి అవసరా ేమిటో తెలుసుకునేంత దాకా బాగానే వచ్చు. గతంలో ఉన్న గవర్నర్లకూ, ఈయనకూ ఇదే తేడా. తెలుగు తెలియటం ఆయ నకు బాగా కలసి వచ్చిందని అధికారులు సైతం చెబుతున్నారు. మొత్తం మీద గవర్నర్‌ పవర్‌ ఏమిటో నరసింహన్‌ అటు సర్కార్‌కూ, ఇటు అధికారులకూ రుచి చూపిస్తున్నారన్న సంతోషం జనంలో కనిపిస్తున్నది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more