జగన్ కోసం నెత్తుటి బ్యానర్లు

కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు కొంత మంది వీరభక్తిని ప్రదర్శించుకున్నారు. జగన్ కు స్వాగతం పలుకుతూ నెల్లూరులోని గాంధీ సర్కిల్ లో నెత్తుటి బ్యానర్లు కట్టారు. అందుకు గాను కాంగ్రెసు నాయకుడు కాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన అనుచరులు అందుకు రక్తదానం చేసినట్లు సమాచారం. ఒక్కొక్కరు 10 మిల్లిలీటర్ల చొప్పున రక్తం దానం చేశారట. ఆలా సేకరించిన రక్తంలో కర్ర ముంచి నెత్తుటి సంతకాలు చేశారని చెబుతున్నారు. వైయస్ జగన్ కోసం రక్తం ధారపోయడానికి కూడా సిద్దంగా ఉన్నామని శ్రీధర్ రెడ్డి అంటున్నారు. కాగా, జగన్ దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు చెందిన పర్చూరు నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రయత్నించారు. ఈ నియోజకవర్గంలో ఆయన పర్యటన ఒక రకంగా సక్సెస్ అయినట్లే. ఆయన ఓదార్పు యాత్ర ప్రకాశం జిల్లాలో 19వ రోజుకు చేరుకుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+