వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబు ప్రధాన సలహాదారు నారా లోకేష్ బాబా?

లోకేష్ ఆర్ధిక విషయాల్లో ఎంతో నిష్ణాతుడని బాబు నమ్మకం. లోకేష్ నగదు బదిలీ పథకం గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం మేలు చేయలేకపోయింది. ఇప్పుడు లోకేష్ చంద్రబాబు నాయుడికి సలహాదారుడిగా మారాడు. ఢిల్లీలో తెలంగాణపై జరుగనున్న అఖిలపక్ష సమావేశానికి హాజరు కావద్దని లోకేష్ తండ్రి గారికి సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపు జరుగనున్న ఆ సమావేశానికి తెలుగుదేశం తరఫున నాగం జనార్ధన్ రెడ్డి, కోడెల శివప్రసాదరావు హాజరవుతున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణపై తీసుకున్న కప్పదాటు వైఖరి విమర్శలకు దారి తీస్తోంది. ఆయనను ఇటు ఆంధ్రులు అటు తెలంగాణ వారు నమ్మలేని పరిస్ధితి ఏర్పడింది.