తన కుమారుడు నారా లోకేష్ వాణిజ్య కార్యకలపాల కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ యాత్ర చేసినట్లు వినికిడి. మూడు రోజుల పాటు ఆయన సింగపూర్ పర్యటన చేశారు. లోకేష్ ను వాణిజ్యవేత్తగా నిలబెట్టడానికి తగిన ఏర్పాట్లన్నీ చంద్రబాబు ఇప్పటికే చేశారట. దాన్ని విస్తరించే పనిలో భాగంగానే ఆయన సింగపూర్ యాత్ర చేసినట్లు చెప్పుకుంటున్నారు. వారితో పాటు పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కూడా సింగపూర్ వెళ్లారట. లోకేష్ వ్యాపారాభివృద్ధికి సుజనాచౌదరిని వాడుకుంటున్నట్లు సమాచారం. లేదా సుజనా చౌదరితో పాటు లోకేష్ కలిసి పని చేస్తూ ఉండవచ్చునని అంటున్నారు. పార్టీ నాయకులు పలువురు వ్యతిరేకించినప్పటికీ చంద్రబాబు అప్పట్లో సుజనా చౌదరికి రాజ్యసభ టికెట్ ఇవ్వడంలోని మతలబు ఇదేనట. పార్టీ కోసం పని చేసినవారిని విస్మరించి సంపన్నులకు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే చంద్రబాబు రాజ్యసభ టికెట్లు కట్టబెట్టారనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. వారి అభ్యంతరాలను తోసిపుచ్చుతూ సుజనాచౌదరికి పెద్ద పీట వేయడంలోని ఆంతర్యం లోకేష్ ను వ్యాపారవేత్తగా నిలబెట్టడం కోసమేనట.