కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎల్ కు హోంశాఖ ఖాయమా?

By Santaram
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
వైయస్ దుబారా చేయడం వల్లనే రాష్ట్రం అధోగతి పాలైందని సీనియర్ కాంగ్రెసు ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించి, రోశయ్యను మెచ్చుకోవడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. వచ్చే నెలలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో డిఎల్ కు హోంమంత్రి పదవి ఇస్తారన్న అభిప్రాయం దీనితో బలపడింది. వైయస్ అతి క్షమాగుణం వల్లే పరిపాలనా వ్యవస్థ గాడి తప్పిందన్న సంచలన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెసు‌లో కలవరం సృష్టించింది. నిన్న డీఎల్‌, నేడు జేసీ వరస వెంట వరస వైయస్ పథకాలను విమర్శించడం వ్యూహాత్మకమేనని, వాటి వెనుక ఎవరున్నారన్న చర్చ పార్టీలో మొదలయింది. వైయస్ పాలనా తీరుపై బుధవారం ఆయన జిల్లాకే చెందిన ఎమ్మెల్యే డీఎల్‌ రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు.

వైయస్ ప్రారంభించిన పథకాలు ఇప్పుడు ఆర్థిక భారంగా మారాయని, వాటిని రద్దు చేయకపోతే ప్రభుత్వం నడపటం కష్టమని స్పష్టం చేశారు. ఆ పథకాలతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని విరుచుకుపడ్డారు. గతంలో మంత్రిపదవి ఆశించి భంగపడిన డీఎల్‌ అసంతృప్తిని అర్థం చేసుకోవచ్చని, కానీ వైయస్ మంత్రివర్గంలో పనిచేసిన జేసీ కూడా ఆయన పరిపాలనపై ధ్వజమెత్తడం వింతగా ఉందన్న వ్యాఖ్యలు వైయస్ వర్గీయుల నుంచి వినిపిస్తున్నాయి.

'ఇప్పుడు వైయస్ పాలన వల్లే ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని వ్యాఖ్యానిస్తున్న జేసీ గతంలో ఆయన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న విషయం మర్చి పోయినట్లున్నారు. నాడు తీసుకున్న నిర్ణయాల్లో జేసీ కూడా భాగ స్వామే. ఇప్పటి ఆర్థిక పరిస్థితిపై వాపోతున్న జేసీ ఆనాడు ఆ పథకాలను ఇప్పటిమాదిరిగానే ఎందుకు బాహాటంగా వ్యతిరేకిం చలేదు? ఆర్థిక పరిస్థితి బలహీనమవుతుందనిక్యాబినెట్‌ సమావేశంలోనయినా ఎందుకు వాదించలేద"ని వైయస్ వర్గానికి చెందిన ఓ సీనియర్‌ ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ కలర్‌ టీవీ హామీని ప్రకటించిన సమయంలో.. అసలు ఆ పథకం హామీని మనమూ ఇవ్వాలని వైయస్, కేవీపీకి తానే సూచించానని స్వయంగా జేసీనే ఆనాడు చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా..రాజ్యసభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉండటంతో చాలామంది సీనియర్లు, తమ బెర్తులను ముందుగానే రిజర్వు చేసుకునే వ్యూహంలో భాగంగానే వైయస్ పథకాలను విమర్శిస్తున్నారని ఆయన వర్గీయులు విశ్లేషిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X