కాంగ్రెసుకు రాజీనామా చేసి, కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధపడుతున్న వైయస్ జగన్ పైనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆశలు పెట్టుకున్నారట. కాంగ్రెసుకు తన దెబ్బ చూపించడానికి వైయస్ జగన్ వల్ల అవకాశం లభిస్తుందేమోనని ఆయన ఆరాటమని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని వైయస్ జగన్ కూలిస్తే మధ్యంతర ఎన్నికలు వస్తాయని అందరూ అనుకుంటున్న మాటే. అ సత్తా ఏదో మేరకు జగన్ కు ఉందని భావిస్తున్నారు. మధ్యంతరం వస్తే తెలంగాణలో అన్ని పార్టీలను తుడిచిపెట్టేయవచ్చునని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. మధ్యంతరం తప్పదని ఆయన ఓ సభలో కూడా అన్నారు. మధ్యంతరం వస్తే ఎంత లేదన్న తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో కనీసం సగం స్థానాలు వస్తాయి. అదృష్టం కలిసి వస్తే 70 నుంచి 90 సీట్లు కూడా రావచ్చు. అందువల్ల వైయస్ జగన్ వైపు కెసిఆర్ చూస్తున్నారని అంటున్నారు.