రాష్ట్రంలో పెద్దలపై మావోయిస్టు గెరిల్లాల గురి?

అదునుచూసి దెబ్బకొట్టే విధానంలో ఆరితేరినవారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రముఖులను టార్గెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రాంతీయ ఉద్యమ సమయంలో దాడులకు పాల్పడే అవకాశాలు లేకపోలేదనేది ప్రస్తుతం నిఘా వర్గాలకు అందిన సమాచారం. ఈ తరుణంలోనే రాష్ట్ర రాజధానిలో అసెంబ్లీ బడ్జెట్ సమా వేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖఅత్యంత అప్రమత్తమై సరిహద్దు ప్రాంతాల్లో భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
అయితే ఛత్తీస్‌గఢ్‌లోని మల్కాన్‌గిరి, కోరాపూట్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే మిలటరీ గెరిల్లా ఆర్మీ(మావోయిస్టు) ఆయా ప్రాంతాల్లో భారీ స్థాయిలో విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మావోలు గెరిల్లా ఆర్మీ తరహాలో ఒక్కో కంపెనీలో వందమంది సభ్యులు అత్యంత ఆధునిక ఆయుధాలను పట్టుకుని రాష్ట్రంలోకి ప్రవేశించి భారీ స్థాయిలో దాడులకు దిగేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా ఏవోబీ (ఆంధ్రా-ఒరిస్సా) సరిహద్దు ప్రాంతంలో మావోయి స్టులు చెలరేగిపోతున్నారనీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్టల్రలో కూడా పోలీసులపై దాడులకు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications