ఆంధ్ర ఉత్పత్తులు అంటే ఏవి? తెలంగాణ వాసులు వాడుతున్న ఆంధ్ర ఉత్పత్తులేమిటి? ఆంధ్ర బియ్యాన్ని ఇక్కడ వాడరు. వరంగల్ బియ్యం ఇక్కడ ఫేమస్. ఆంధ్రలో కంది పండదు. కందిపప్పులు తాండూరే ఫేమస్. వార్త మినహా దినపత్రికలు, వారపత్రికలు ఆంధ్రావాళ్ళవే. వాటిని బహిష్కరించాలా? హెచ్ ఎంటీవీ మినహా టీవీ చానళ్ళు అన్నీ ఆంధ్రా వాళ్ళవే. వాటిని బహిష్కరించాలా? హైదరాబాద్ లో ఆంధ్ర మెస్ లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని బహిష్కరించాలా? పొట్టకూటి కోసం వచ్చి నలుగురు పొట్టలు నింపుతున్న వారిని వెళ్ళగొట్టాలా? ఆంధ్ర ఉత్పత్తులను బహిష్కరించమని ప్రొఫెసర్ కోదండరామ్ ఇచ్చిన ఈ పిలుపులో స్పష్టత లేదు.
తెలంగాణలో ఆంధ్రావ్యాపారులు బాగా వర్ధిల్లుతున్నది సినిమా రంగంలో, కార్పొరేట్ విద్యా రంగంలో మాత్రమే. మద్యం సిందికేట్లు రాయలసీమ వాళ్లవి ఉన్నప్పటికీ వాళ్ళు లేకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి పడతారు. సినిమారంగాన్ని, కార్పొరేట్ విద్యాసంస్ధల్ని స్పష్టంగా టార్గెట్ చేయకుండా అస్పష్టంగా బహిష్కరణ పిలుపు ఇవ్వడం అవివేకమే. కోదండరామ్ యూనివర్సిటీలో ఈ సబ్జెక్ట్ చెబుతారో తెలియదు కానీ అక్కడైనా ఆయన స్పష్టంగా, విద్యార్ధులకు ఎక్కువ మార్కులు వచ్చేలా పాఠాలు చెబితే బాగుంటుంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి