ప్రముఖ సినీ నటి రోజారమణి చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చిరంజీవి కూడా చెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారే తప్ప వచ్చే వారు లేని సమయంలో ఎవరు వచ్చినా చిరంజీవి రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్దంగా ఉంటారని గిట్టని వారంటున్నారు. మహిళారాజ్యం అధ్యక్షురాలిగా శోభారాణిని చెప్పా పెట్టకుండా తొలగించిన తర్వాత ఆ స్థానంలో రోజారమణిని నియమించేందుకు చిరంజీవి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. రోజారమణి కోసమే శోభారాణిని చిరంజీవి దూరం చేసుకున్నారనే మాట కూడా వినిపిస్తోంది. అయితే శోభారాణి ఎక్కువ బాధపడుతున్నది వాసిరెడ్డి పద్మ వల్లనే అని అంటున్నారు. ఇద్దరు నారీమణుల మధ్య మరో నారీమణి శోభారాణి ఇమడలేక చిటపటలాడారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రోజారమణి అడుగు పెడితేనైనా పార్టీకి బలం చేకూరుతుందా అనేది అనుమానమే.