వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరంజీవి మాస్టారు కోసం ఉస్మానియాలో చెప్పులు సిద్ధం!

కోస్తా ఆంధ్ర జిల్లాల్లో సమైక్యవాదాన్ని విన్పిస్తున్న చిరంజీవి ఉస్మానియా విద్యార్ధులకు శాంతి పాఠాలు చెప్పడానికి రావాలనుకుంటున్నారు. అయితే 28 తర్వాత పరిస్ధితులు ఎలా ఉంటాయో, ఆయన ఎంత వరకు ఆ సాహసం చేస్తారో స్పష్టంగా తెలియడం లేదు. చిరంజీవి దీనిని చాలెంజ్ గా తీసుకుని విద్యార్ధుల్లో పరివర్తన తేవడానికి ముందుకు వస్తారా రారా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కోస్తాఆంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు అంత సమర్ధంగా సాగకపోవడం చిరంజీవికి నిరుత్సాహం కలిగిస్తోంది. అనవరంగా సమైక్యాంధ్ర నినాదాన్ని మోస్తున్నానా అన్న బెంగ ఆయనకు పట్టుకున్నట్టు కన్పిస్తోంది.