వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై హైకమాండ్ రోశయ్యను సంప్రదిస్తుందా?

రోశయ్య ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో పర్యటించవలసి ఉంది. ఆ కార్యక్రమం అధికారికంగా ఖరారైనప్పటికీ ఒక మెలిక ఉంది. ఈసారి రోశయ్యను తెలంగాణ విషయంలో కేంద్రం సంప్రదించే అవకాశముందని తెలుస్తోంది. ఆయనను 27న ఢిల్లీ పిలిపించుకుని, ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుని అధి నాయకులు చర్చించుకోవచ్చు. ఈసారి రోశయ్య అభిప్రాయానికి, అనుభవానికి కొంత విలువ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. "మీరు ఎలా చెబితే అలా" అనకుండా రోశయ్యను తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పమని సోనియా గాంధీ తదితరులు నిలదీయవచ్చు. అప్పుడు రోశయ్య ఏం చెబుతారు? తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని చెబుతారు. ఆ పదవిలో ఎవరున్నా అదే చెబుతారు. సీటు మహత్యమంటే అదే.