వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ యాత్ర కాంగ్రెసు అధిష్టానానికి పెద్ద సవాల్

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
జగన్ ఓదార్పు యాత్ర కాంగ్రెసు అధిష్టానవర్గానికి పెద్ద టెన్షన్ యాత్ర అయింది. అనుమతిస్తే ఒక సమస్య, అనుమతించకుంటే మరో పెద్ద సమస్య. కడప ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్రను అనుమ తించాలని రాజ్యసభ సభ్యుడు, ప్రజారక్షణ-భద్రత కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు కాంగ్రెసు‌ అధినేత్రి సోనియాగాంధీని అభ్యర్థించారు. శనివారం ఆయన ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో ఆమెతో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలు ఆమెతో చర్చించారు. ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ కంటే ముందే కేవీపీ అధినేత్రిని కలవడం చర్చనీయాంశమ యింది. వైయస్‌ జీవించినప్పుడు, తర్వాత పార్టీ అధ్యక్షు రాలిని కేవీపీ విడిగా కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గతంలో వైయస్‌ అనేక సంద ర్భాల్లో కలిసినప్పుడు, ఆ తర్వాత జగన్‌ తొలిసారి సోని యాను కలిపినప్పుడు మాత్రమే కేవీపీ వారి వెంట ఉండటం ప్రస్తావనార్హం. విశ్వ సనీయ సమాచారం ప్రకారం..జగన్‌ యాత్రపైమీ అభిప్రాయమేమిటని సోనియా ఆయనను ప్రశ్నిం చారు. ఆ సందర్భంగా తన వద్ద ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో జగన్‌ కార్యకలాపాలను ఆమె ఆరా తీశారు. పార్టీ నాయకత్వ ఆదేశాల మేరకు జగన్‌ తన యాత్రను వా యిదా వేసుకున్నందున, జగన్‌ ఓదార్పు యాత్రకు అను మతి ఇస్తే బాగుంటుందని కేవీపీ అభ్యర్థించారు.

జగన్‌ మీకు విధేయుడేనని, ఆ విషయాన్ని గతంలో మీ వద్దకు వచ్చినప్పుడు కూడా అతను స్పష్టం చేశాడని గుర్తు చేశా రు. యాత్రకు సంబంధించి వచ్చే ఫిర్యాదుల్లో పస లేదన్నారు. జగన్‌ పర్యటన వల్ల పార్టీకి లాభమే తప్ప, నష్టమేమీ లేదని..అందులో అంతా పార్టీ నేతలు, శ్రేణులే పాల్గొంటున్నందున పార్టీ బలపడుతుందని ఆయన విశ్లేషించారు. జగన్‌ సేవలను వీలైనంత ఎక్కువగా పార్టీకి వినియోగించుకోవడం మంచిదని అభ్యర్థించారు.

వైయస్‌ సేవలను ప్రజలను ఇంకా మర్చిపోలేదని, ఆయన వారసుడిగా జగన్‌ చేసే పర్యటనలు పార్టీకే లాభం చేకూరుస్తాయని వివరించారు. ఉప ఎన్నికలకు, ఓదార్పు యాత్రకు సంబంధం లేదని, తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతు న్నందున, ఉత్తరాంధ్ర, కోస్తాలో జరిగే ఓదార్పు యాత్రకు అనుమతి ఇస్తే బాగుంటుందని సూచించారు. పైగా, అసెం బ్లీ కూడా ఉన్నందున దానిపై త్వరగా నిర్ణయం తీసుకుంటే గందరగోళానికి తెరదించినట్టు ఉంటుం దన్నారు. ఇప్పటికే యాత్రకు సంబంధించి రాష్ట్ర మీడియాలో విభిన్న కథనాలు వెలువడుతున్నాయని, దానివల్ల ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా, కేవీపీ అభ్యర్థనను విన్న సోనియా..ఓదార్పు యాత్రపై ఏ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేయ కుండా, అన్నీ సావధానంగా విన్నారని సమాచారం. తాను మొయిలీతో చర్చిస్తానని మాత్రమే ఆమె అన్నట్లు తెలిసింది. అదేవిధంగా, తెలంగాణలో జరగనున్న 12 నియోజకవర్గాల ఉప ఎన్నికలపైనా చర్చించారు. వైయస్‌ ఉన్నప్పుడు అభ్యర్థుల ఎంపికలో పాటించిన ఫార్ములాను ఆమె ఆరా తీశారు. ప్రస్తుతం తెలంగాణలోని ఆ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితి ప్రకారం కాంగ్రెసు‌కు నాలుగు సీట్లు ఖాయంగా వచ్చే అవకాశాలున్నాయని కేవీపీ ఆమెకు స్పష్టం చేశారు. ఇంకొంచెం దృష్టి సారించి, పకడ్బందీగా వ్యవహరిస్తే మరొక సీటు వచ్చినా ఆశ్చర్యపడవనవసరం లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X