కెవిపినీ విచారించనున్న సిబిఐ?

వాన్‌పిక్ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన భానును, గతంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన మన్మోహన్ సింగ్‌ను, తదితర అధికారులను విచారించినప్పుడు కెవిపి రామచందర్ రావు పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ప్రాజెక్టులపై వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు కెవిపి రామచందర్ రావు అధికారులపై పెట్టిన ఒత్తిళ్లు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల మంత్రి శంకరరావు సిబిఐ విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా కెవిపిని సిబిఐ పట్టించుకోవడం లేదనే. కెవిపిని వదిలేసి ఐఎఎస్ అధికారులపై పడ్డారనేది శంకరరావు మంట అని అంటున్నారు.












Click it and Unblock the Notifications