శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసే విషయంపై సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. రాజీనామా చేయాలనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాటను ఆమె పట్టించుకోవడం లేదని అంటున్నారు. రాజీనామాలతో ప్రజలు విసిగిపోయారని ఆమె పత్రికా ప్రతినిధితో అన్నారు. దీన్నిబట్టి ఆమె రాజీనామాకు సిద్ధంగా లేరనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసు పార్టీకి మాత్రం ఆమె రాజీనామా చేశారు.
తెలంగాణ కోసం జయసుధ గతంలో ఓసారి రాజీనామా చేశారు. వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులతో పాటు ఆమె రాజీనామా చేయలేదు. దాంతో ఆమెపై రాజీనామాకు ఒత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అయినా, ఆమె అందుకు సుముఖంగా లేరనే వార్తలు వస్తున్నాయి.