కిరణ్ పర్యటనకు జెసి డుమ్మా!

JC Diwakar Reddy-Kiran Kumar Reddy
అనంతపురం సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు డుమ్మా కొట్టారు. కిరణ్ శుక్రవారం ఆయన సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఆయన మాత్రం హైదరాబాదులోనే ఉండిపోయారు. జిల్లా మంత్రి రఘువీరా రెడ్డితో సహా మిగిలిన నేతలతో ఆయనకు విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇటీవల పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ప్రజారాజ్యం పార్టీ జిల్లా విలీన సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. అయితే ఆయన వర్గం నేతలు మాత్రం హాజరై హంగామా చేస్తారు!

కిరణ్ అనంత పర్యటన, తన గైర్హాజరీపై హైదరాబాదులో ఉన్న ఆయనను మీడియా కదిలించగా తాను కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని, ఆప్తుడిని అయినందు వల్లే పర్యటనలో పాల్గొనలేదని చెప్పారు. తనకు హైదరాబాదులో వేరే కార్యక్రమం ఉన్నందున సమయం చిక్కలేదని చెప్పారు. కాగా కిరణ్ మంత్రివర్గంలో ఆశలు పెట్టుకున్నప్పటికీ జెసికి చోటు దక్కక పోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+