చంద్రబాబుతో కలిసి జెసి ప్రతీకారం?

అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెసికి చెందిన ప్రజాప్రతినిధులు 52 మంది గోవింద రెడ్డికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీకి 26 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. అయితే, జెసి వర్గానికి చెందిన 52 మంది క్రాస్ ఓటింగుకు పాల్పడితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం. ఇప్పుడు అదే జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మధ్య జెసి దివాకర్ రెడ్డి శాసనసభ ఆవరణలో చంద్రబాబును కలుసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ ఒప్పందం కోసమే ఆయన చంద్రాబబుతో సమావేశమైనట్లు ఇప్పుడు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications