ఇక కాంగ్రెసు టార్గెట్ కెసిఆర్?

చంద్రబాబు, జగన్ అయిపోయన తర్వాత ఇక ఎవరి వంతు అనే విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో తమకు కొరకరాని కొయ్యగా తయారై, జాతీయ స్థాయిలో తమను చిక్కుల్లో పడేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై వారు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. కెసిఆర్‌నే కాంగ్రెసు పెద్దలు ఇప్పుడు టార్గెట్ చేసుకుంటారని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటుంటే కాంగ్రెసు నాయకులు హాయిగా గాలి పీల్చుకుంటున్నారు. కెసిఆర్ పని కూడా చంద్రబాబు, జగన్ మాదిరిగానే అయితే, తమకు ఎదురు ఉండదని కాంగ్రెసు పెద్దలు భావిస్తున్నారట. ఇందుకు సంబంధించి తెలుగు టీవీ చానెళ్లు కూడా నిత్యం ఊదరగొడుతున్నాయి.












Click it and Unblock the Notifications