వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ నిర్ణయానికి తనయుడి బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

KT Rama Rao-K Chandrasekhar Rao
ఇటీవల కాంగ్రెసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని విలీనం చేసే ప్రతిపాదనపై జోరుగా చర్చ సాగింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెరాస కాంగ్రెసులో విలీనమవుతుందని కాంగ్రెసు నాయకులు పోటీ పడి ప్రకటనలు ఇచ్చారు. సకల జనుల సమ్మె సాగుతున్న నేపథ్యంలో కెసిఆర్ తెలంగాణ జెఎసి ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లిన సమయంలో తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కెసిఆర్ కాంగ్రెసు పెద్దలకు హామీ ఇచ్చారట. దానివల్ల కాంగ్రెసు తెలంగాణ నాయకులు విలీనంపై ప్రకటనలు చేశారని అంటున్నారు. నిజానికి, తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి కెసిఆర్ మొదటి నుంచి సిద్ధంగానే ఉన్నట్లు చెబుతున్నారు.

కెసిఆర్ హామీని ఆయన తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు కొట్టిపారేసినట్లు చెబుతున్నారు. విలీనంపై కెసిఆర్‌తో కెటిఆర్ తీవ్రంగా విభేదించారని వినికిడి. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తే తన రాజకీయ ఉనికి దెబ్బ తింటుందని కెటి రామారావు భయపడుతున్నారట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెరాస పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుని ధూమ్‌ధామ్ రాజకీయాలు నడపాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో తమ పార్టీని విలీనం చేస్తే కాంగ్రెసు నాయకుల్లో తాను ఒకడు కావాల్సి వస్తుంది. విలీనం చేయలేకపోతే తెరాసలో తానొక్కడే అంతా అయి రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చునని కెటిఆర్ ఉత్సాహపడిపోతున్నారని అంటున్నారు.

English summary
It is said that MLA KT Rama Rao is opposing his father and TRS president K Chandrasekhar Rao proposal to merge party in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X