మునిగిన బొత్స, ఢిల్లీకి పరుగులు?

సోమవారం సాయంత్రం బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిని కలిశారు. డిసిసి అధ్యక్షుల నియామకంపై, ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు ఆయన ముఖ్యమంత్రితో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే, అసలు కారణం మాత్రం లిక్కర్ రాకెట్ వ్యవహారమేనని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కాగా, లిక్కర్ రాకెట్‌పై వివరణ ఇవ్వడానికి రావాలని అధిష్టానం పెద్దలు బొత్సకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయన ఢిల్లీకి పరుగులు తీసినట్లు చెబుతున్నారు. అయితే, సంస్థాగత వ్యవహారాలపై చర్చకు మాత్రమే బొత్స ఢిల్లీ వెళ్లారనేది బయటకు కనిపించే కథనం. అయితే, లిక్కర్ లాబీ వ్యవహారంలో బొత్సపై వినిపిస్తున్న వ్యాఖ్యలు గాలి కబుర్లేనా, లేదా అనేది తెలియదు.












Click it and Unblock the Notifications