గత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కాంగ్రెసు తన చేతివాటాన్ని చిరంజీవికి చూపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో తనవారిని నియమింపజేసుకోవడానికి చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలను మంత్రులే కాదు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తిప్పికొడుతున్నారు. గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి చిరంజీవి ఇద్దరి పేర్లను సూచించారు. జిల్లా ప్రజారాజ్యం కన్వీనర్ లింగసెట్టి ఈశ్వర రావు, మాజీ అధికారి టివి రావు పేర్లను చిరంజీవి సూచించారు. అయితే, జిల్లా మంత్రులు వారికి అడ్డుపుల్లలు వేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, మాణిక్యవర ప్రసాద్ అందుకు సుముఖంగా లేరు. దాంతో ఆ నియామకం ఆగిపోయింది. ఈ విషయంపై చిరంజీవి ముఖ్యమంత్రికి ఫోన్ చేశారట. వారిద్దరు జిల్లా మంత్రులకు నచ్చటం లేదని, ఇతర పేర్లు సూచించాలని కిరణ్ కమార్ రెడ్డి చిరంజీవికి కూల్‌గా చెప్పారట. మంత్రులు తమకు నచ్చినవారికి ఆ పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారు. దీంతో చిరంజీవి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.
As the Congress high command keeps him at bay on the proposed merger of Prajarajyam Party with itself, Chiranjeevi is finding it difficult to install his close aides and followers in government-nominated posts in the face of opposition from some senior leaders in the ruling party.
Story first published: Tuesday, July 26, 2011, 9:47 [IST]