కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణను అడ్డుకోవడానికి ఎంత దూరమైన వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. బుధవారం పార్లమెంటులో పంచి పెట్టిన తెలంగాణ వ్యతిరేక కరపత్రాల పని లగడపాటి రాజగోపాల్ వ్యవహారమేనని అనుమానిస్తున్నారు. తెలంగాణ ఇవ్వడం వల్ల సంభవించే దుష్పరిణామాలను వివరిస్తూ వివిధ నాయకుల చేతుల్లోకి ఆ కరపత్రాలు వెళ్లాయి. కరపత్రాల పంపిణీపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తీవ్రంగా మండిపడ్డారు. ఆ పని లగడపాటి రాజగోపాల్‌దేనని గుర్తించిన అహ్మద్ పటేల్ ఆయనను పిలిపించి నాలుగు అక్షింతలు వేసినట్లు చెబుతున్నారు. కరపత్రాల పని తనది కాదని చెబుతూ లగడపాటి రాజగోపాల్ మీడియా ప్రతినిధుల సమావేశం పెట్టారు. ఆయన మీడియా సమావేశంలో కరపత్రంలోని విషయాలనే ఏకరవు పెట్టారు. ఓ విషయం మాత్రం కొత్తగా చెప్పారు. మేలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. లగడపాటి రాజగోపాల్ జోస్యాలకు పెట్టింది పేరని తెలిసిందే. ఏమైనా, విజయవాడ నుంచి హైదరాబాదుకు పోలీసుల కళ్లు గప్పి పారివచ్చిన లగడపాటి కరపత్రాల వ్యవహారం నడిపారంటే నమ్మవచ్చునని అంటున్నారు.
It is said that the pomphlets opposing Telangana were the handy work of Vijayawada Congress MP Lagadapati Rajagopal. He is very much prepared to oppose the formation Telangana state.
Story first published: Thursday, February 24, 2011, 9:44 [IST]