సైకిలెక్కనున్న నటి రవళి

Ravali
అవకాశాలు లేక ఉసూరుమంటున్న నటి రవళి సైకిలెక్కడానికి సిద్ధపడుతోందట. నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆమె ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు. తెర మీద అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయాల్లో తన సత్తా చాటాలని ఆమె అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెతో తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమవతి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రవళితో పాటు బుల్లితెర నటీనటులు కొంత మంది తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి తారాబలం దండిగా ఉంటూ వచ్చింది. జయప్రద, రోజా వంటి నటీమణులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సినీ గ్లామర్ కొరవడినట్లు కనిపిస్తుండడంతో శోభా హైమవతి రవళి కోసం, మరింత మంది టీవీ నటీనటుల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఎంత మంది వచ్చిన కాలికి బలపం కట్టుకుని, నోటికి తెంపు లేకుండా తెలుగుదేశం పార్టీలో సత్తా చాటిన రోజాకు సరి రాగలరా అనేది చెప్పలేం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+