వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ నటి రోజాకు సోమవారం శానససభ వద్ద చుక్కెదురైంది. ఆమెను భద్రతా సిబ్బంది శాసనసభ ఆవరణలోకి ఆడుగు పెట్టనివ్వలేదు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు సమర్పించే సమయంలో వారితో పాటు ఆమె బస్సులో అసెంబ్లీ దాకా వచ్చారు. అయితే, బస్సును బారికేడ్ల వద్దనే ఆపేశారు. లోనికి శాసనసభ్యులను మాత్రమే అనుమతించారు. రోజాతో పాటు పలువురు నేతలను బయట నిలిపేశారు.
శాసనసభలోకి అడుగు పెట్టాలనే రోజా ఆశ ఈ రకంగా కూడా నీరు గారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాసనసభలోకి రావాలని ఆమె రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, అదృష్టరేఖ తిరగబడి ఆమెకు ఆ అవకాశం రాలేదు.