ఈనాటి బాబు, సుజనా బంధం ఏనాటిదో..

సాక్షి దినపత్రిక కథనం ప్రకారం - హెరిటేజ్ ఇన్‌ఫ్రాలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి 49 శాతం వాటా ఉంది. అందుకే కారు చౌకగా హెరిటేజ్ ఫుడ్స్ భూమిని హెరిటేజ్ ఇన్‌ఫ్రాకు బదిలీ చేశారు. తమిళనాడులోని అద్దె దుకాణంలో నడిచే సుజనా చౌదరికి చెందిన శ్రీచక్ర మర్కంటైజింగ్ లిమిటెడ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆర్థిక రుణాల సంస్థ సికామ్ లిమిటెడ్ వద్ద 60 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. అందుకు హామీగా హెరిటేజ్ ఇన్‌ఫ్రా తన 3.47 ఎకరాల భూమిని తాకట్టు పెట్టింది. హెరిటేజ్ ఇన్‌ఫ్రా ఖాతాలో ఉన్నంత వరకు ఆ భూమి విలువను రూ.2.73 కోట్లుగా పేర్కొని, తాకట్టు పెట్టినప్పుడు మాత్రం రూ.85 కోట్లుగా చెప్పారు. ఈ వ్యవహారంలో రూ.60 కోట్లు ఎక్కడికి చేరాయనేది ప్రశ్న. ఇదంతా జరిగిన తర్వాత చంద్రబాబు సుజనాచౌదరికి రాజ్యసభ సీటు కట్టబెట్టారు.












Click it and Unblock the Notifications