తెలంగాణ రాష్ట్ర సమతి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌తో రహస్య ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు అరవింద్ కుమార్ గౌడ్ విమర్శించారు. వైయస్ జగన్ ఫీజు పోరుకు కెసిఆర్ తెలంగాణ విద్యార్థులను తరలిస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌ను కెసిఆర్ వెనుకేసుకుని వస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాదులోని జగన్ ఫీజు పోరు దీక్ష చేస్తుంటే ఏ విధమైన ఆటంకాలు కల్పించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు వస్తే తాము తెలంగాణలో, జగన్ సీమాంధ్రలో విజయం సాధిస్తామని కెసిఆర్ అనడాన్ని కూడా అరవింద్ కుమార్ గౌడ్ వ్యతిరేకించారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే అడ్డుకుని తీరుతుతామని తెరాస నాయకుడు హరీష్ కుమార్ అంటున్నారు.
There are rumours that KCR are is supporting Ex MP YS Jagan. Telugudesam leader Aravind kumar Goud alleged that KCR is not opposing YS Jagan, who is on fast in Hyderabad. He expressed doubts that there was a secret understanding between KCR and YS Jagan.
Story first published: Monday, February 21, 2011, 11:42 [IST]