అడిగితే ఏడ్చేస్తున్న ఐఎఎస్ శ్రీలక్ష్మి

తమ ప్రశ్నలకు ఇబ్బంది పడుతున్న ప్రతిసారీ ఆమెకు వైద్య సేవలు అందిస్తూ విశ్రాంతి ఇస్తూ సిబిఐ అధికారులు ఆమెను ప్రశ్నించారట. అయితే, ఆమె నుంచి సరైన సమాధానాలు రాలేదని చెబుతున్నారు. మొత్తంగా ఆమె విచారణకు సహకరించడం లేదని అంటున్నారు. దీంతో శ్రీలక్ష్మి కస్టడీని పొడగించాలని సిబిఐ కోర్టును అభ్యర్థించే అవకాశాలున్నాయి. అయితే, తీరిక సమయాల్లో శ్రీలక్ష్మి న్యాయశాస్త్ర పుస్తకాలను తిరిగేస్తున్నారని చెబుతున్నారు. తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో మాత్రం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ అధికారి రాజగోపాల్‌పై నిందలు వేస్తూ తాను తప్పించుకోవడానికి తగిన మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications