దాసరిపై రామ్ చరణ్ వ్యాఖ్యల వెనక..

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో చిరంజీవి కాంగ్రెసు నాయకుడిగా మారిపోయారు. అప్పటికే కాంగ్రెసు పార్టీలో దాసరి నారాయణ రావు ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చిరంజీవితో పాటు దాసరిని కూడా సమానంగా చూస్తున్నారని అంటున్నారు. ఈ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో చిరంజీవికి దాసరి పోటీ వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ స్థితిలోనే దాసరి నారాయణరావుపై రామ్ చరణ్ తేజ చేత వ్యాఖ్యలు చేయించారని ఆంటున్నారు. అయితే, రామ్ చరణ్ తేజ చేత చిరంజీవి మాట్లాడించారా, అల్లు అరవింద్ మాట్లాడించారా అనేది తేలడం లేదని గిట్టనివారంటున్నారు.












Click it and Unblock the Notifications