కిరణ్ మంత్రుల్లో జగన్ కోవర్టులు?

జెసి దివాకర్ రెడ్డి తన ఆరోపణలనకు దృష్టాంతాలను కూడా చూపుతున్నారు. ఓ మంత్రి ఇడుపులపాయకు వెళ్లి వైయస్ జగన్ కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. అలాగే ఓ మంత్రి కూతురు స్వయంగా జగన్‌ను కలిసి మద్దతు తెలిపారని అన్నారు. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెబుతున్నారు. మంత్రివర్గంలోని జగన్ కోవర్టులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన జెసికి కిరణ్ కుమార్ రెడ్డి మొండిచేయి చూపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications