జగన్ రికార్డ్: వేర్వేరు పేర్లతో కల్సిన బ్రదర్ అనిల్?

YS Jagan - Anil Kumar
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన బావ బ్రదర్ అనిల్ కుమార్ వేర్వేరు పేర్లతో కలిశారట. మే 29 నుండి సెప్టెంబర్ 27 వరకు నాలుగు నెలల్లో ఆయన 42 ములాకత్‌ల ద్వారా 134 మందితో మాట్లాడారు. రిమాండు ఖైదీ రోజుకు ఒకరి కన్నా ఎక్కువమందితో మాట్లాడటం దేశ చరిత్రలోనే రికార్డ్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ కేవలం 4 నెలల్లో 134 మందిని జైల్లో ములాకత్‌లో కలుసుకున్నారట. ప్రత్యేక సౌకర్యాలతో ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న విఐపి ఖైదీలందరి కన్నా జగన్‌వే ఎక్కువ ములాకతులు ఉన్నాయట. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి 86 ములాకత్‌లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఏడాదికి పైగా జైల్లో ఉన్నారు. జగన్ తన కుటుంబ సభ్యులనే ఎక్కువ సార్లు కలిశారట. వీరిలో జగన్ తల్లి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజమయ్మ, 19, భార్య భారతి 36, సోదరి షర్మిల తొమ్మిదిసార్లు జగన్‌న కలిశారు.

జగన్ బావ బ్రదర్ అనిల్‌ కుమార్ ఎనిమిదిసార్లు ములాకత్ తీసుకోగా అందులో కొన్నిసార్లు స్నేహితుడిగా, మరికొన్నిసార్లు అనిల్ బాబుగా రికార్డుల్లో ఉందట. కుటుంబ సభ్యులతో పాటు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ములాకత్‌ల ద్వారా జగన్‌ను కలిశారు. దీంతో జైల్లో కూడా జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారని, అందరు ఖైదీల్లా కాక ఆయన స్వేచ్ఛగా ఉంటున్నారని, ప్రత్యేక సెల్‌లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారని టిడిపి చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోందంటున్నారు.

ఫిబ్రవరి 18న మాజీ డిజిపి అరవింద రావు చంచల్‌గూడ జైలుకొచ్చి సస్పెండైన ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యను జైల్లో కలిశానని చెప్పారు. కానీ, జైలు రికార్డుల ప్రకారం ఫిబ్రవరి 16 నుంచి 20 మధ్యలో ఆచార్య ములాకత్‌ల జాబితాలో అరవిందరావు పేరు నమోదు కాలేదట. సినీ నటుడు మోహన్‌ బాబు ఓసారి ములాకత్‌ ద్వారా చంచల్‌గూడ జైల్లో ఓ విఐపి ఖైదీని కలుసుకున్నారు. అప్పట్లో ఆయన జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ తాను నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిసేందుకు వచ్చానని చెప్పారు.

అయితే నిమ్మగడ్డ ప్రసాద్‌ను మోహన్‌ బాబు కలిసినట్లు రికార్డుల్లో లేదట. జగన్‌ను కలిసిన వారిలో మాత్రం మోహన్‌బాబు పేరుంది. జగన్, గాలి జనార్ధన్ రెడ్డి లాంటి విఐపి ఖైదీల ములాఖత్‌ల విషయంలో చంచల్‌గూడ జైలు అధికారులపై తీవ్ర ఆరోపణలున్నాయి. జగన్‌ను కలిసిన బావ అనిల్ ఓ చోట వైయస్ అనిల్‌ కుమార్ అని, మరో రోజు అనిల్‌ బాబు ఫ్రెండ్ అని రాశారట. సినీ నటుడు మోహన్‌బాబు ఇంటిపేరు ఎం కాగా ఎస్ అని నమోదైందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+