వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ దండులోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana Map
హైదరాబాద్: గులాబీ దండులో చేరడానికి మరో ఇద్దరు శానససభ్యులు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి అటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకో, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకో వలసలు జరుగుతూనే ఉన్నాయి. తెరాసలో చేరడానికి సిద్ధపడిన ఆ ఇద్దరు శానససభ్యులు ఏ పార్టీకి చెందినవారనేది తెలియడం లేదు. అయితే, ఆ ఇద్దరు శానససభ్యులతో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చర్చలు జరిపారని అంటున్నారు.

ఇటీవల ఆయన ఫామ్‌హౌస్‌లో మాకం వేసింది ఆ ఇద్దరు శాసనసభ్యులతో చర్చలు జరపడానికేనని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరి గురించిన వివరాలు బయటకు తెలియకుండా తెరాస జాగ్రత్త పడుతోందని అంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తెరాస కేవలం పది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీకో కట్టిన పొత్తు వికటించి ఉన్న స్థానాలను కూడా జార విడుచుకుంది.

అయితే, ప్రస్తుతం ఆ పార్టీ బలం శానససభలో 17కు పెరిగింది. మరో అనుబంధ సభ్యుడు సోమారపు సత్యనారాయణ కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు, కాంగ్రెసుకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు ఆ పార్టీలకు, శానససభ్యత్వాలకు రాజీనామా చేసి తెరాసలో చేరారు. ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి విజయం సాధించారు.

తెలంగాణ ఉద్యమం కారణంగా చాలా మంది తెరాసలో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, చాలా మంది వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా తెరాస దూకుడుకు కొంత కళ్లెం వేసినట్లు భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసులో కూడా చేరే వెసులుబాటు ఉండడంతో తెరాసలో చేరే విషయంలో కొంత మంది ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.

English summary

 According to media reports - another two MLAs are prepared to join in Telangana Rastra Sa,ithi (TRS). It is said that TRS president K Chandrasekhar Rao held talks with those MLAs recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X