బొత్స నోటి దురుసు: అలిగిన చిరంజీవి మంత్రి

Ganta Srinivas Rao
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నోటి దురుసు కారణంగా రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు అలక వహించారు. అలక వహించడమే కాదు, రోడ్‌షథో నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో శుక్రవారం జరిగింది. రోడ్‌షోకు ప్రజలు పలచగా ఉండడంపై బొత్స సత్యనారాయణ గంటా శ్రీనివాస రావు మీద ఎగిరి గంతేశారు.

తమ కాన్వాయ్ పాట్లేరు, సోల్మన్‌పేట మధ్య వెళ్తుండా బొత్స సత్యనారాయణ గంటా శ్రీనివాస రావుకు క్లాస్ తీసుకున్నారు. "మీ నాయకుడు చిరంజీవి రోడ్‌షోకు ప్రజలను సమీకరించకుండా ఏం చేస్తున్నారు" అని బొత్స సత్యనారాయణ మంత్రి విరుచుకపడ్డారు. దాని కారణం వివరించడానికి గంటా శ్రీనివాస రావు ప్రయత్నించినా బొత్స వినలేదని అంటున్నారు.

బొత్స సత్యనారాయణ గంటా శ్రీనివాస రావుపై తనదైన రీతిలో నోరు పారేసుకున్నట్లు చెబుతున్నారు. దాంతో గంటా శ్రీనివాస రావు వాహనం దిగి ఎవరికీ చెప్పకుండా ప్రచారం నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు. గంటా శ్రీనివాస రావు తన ప్రచారానికి ప్రజలను సమీకరించకపోవడం పట్ల చిరంజీవి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

అయితే, అటువంటిదేమీ జరగలేదని పార్టీ నాయకులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. గంటా శ్రీనివాస రావు ఇతర మండలాల్లో ప్రచారానికి వెళ్లారని వారు చెప్పారు. కానీ ఆయన ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. గంటా శ్రీనివాస రావు లేకుండా చిరంజీవి, బొత్స సత్యనారాయణ రోడ్‌షో ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+