వైయస్ జగన్ పర్యటనలో సిబిఐ దడ?

వైయస్ జగన్ ఎప్పటికప్పుడు తన పర్యటన కార్యక్రమాన్ని మార్చుకున్నారు. కొన్ని గ్రామాల్లో పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఎక్కువగా జనం మధ్యన ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండో రోజు పర్యటనలో ఆయన అలసటగా కనిపించినట్లు స్థానిక మీడియా వ్యాఖ్యానిస్తోంది. పర్యటనలో గ్రామానికి గ్రామానికి మధ్యన కాన్వాయ్‌ని ఆపేసి సుదీర్ఘంగా సెల్‌లో ఆయన మాట్లాడుతున్నారు.
వైయస్ జగన్ పర్యటనలో ప్రసంగాలు కూడా అంత దాటిగా లేవని అంటున్నారు. పర్యటన చివరలో పర్యటనను కుదించి రాత్రి బసను అప్పటికప్పుడు మార్పు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. గుంటూరుకు చెందిన పూసపాటి నాగేశ్వర రావు పైలట్ వర్క్ చేస్తూ ప్రజల హాజరును ఎప్పటికప్పుడు జగన్‌కు తెలియజేస్తున్నారట. ప్రజలు దండిగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత నేరుగా వేదిక వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారని అంటున్నారు.
ప్రజలు ఎక్కువగా లేకపోతే గ్రామం వెలుపల కాన్వాయ్‌ని ఆపు చేసి ఆ తర్వాత వెళ్తున్నారని చెబుతున్నారు. ఏమైనా, సిబిఐ విచారణ ప్రభావం జగన్ పర్యటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఆందోళన చాప కింద నీరులా పరుచుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications