బిసీ ఎజెండా: చంద్రబాబుకు విరుగుడు

ఆయన ఎజెండాకు అప్పుడే ప్రత్యర్థులు, ముఖ్యంగా కాంగ్రెసు నాయకులు విరుగుడు కనిపెట్టినట్లే ఉన్నారు. బీసీ ఎజెండాను ఎదుర్కునేందుకు ప్రధానమైన ప్రశ్నను ముందుకు తెస్తున్నారు. ఆయన జోడు పదవులను సవాల్ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, ఇతర కాంగ్రెసు నాయకులు ఆ సవాల్‌నే విసిరారు.
శాసనసభకు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు వంద సీట్లు ఇస్తామని, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముందు తనకు ఉన్న జోడు పదవుల్లో ఏదైనా ఒకదాన్ని బిసిలకు కట్టబెట్టాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఓడిపోతామనుకునే సీట్లనే చంద్రబాబు బిసిలకు ఇస్తుంటారని అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి, కౌన్సిల్ ప్రభుత్వ విప్‌లు రుద్రరాజు పద్మరాజు, అనిల్ కుమార్, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వీర శివారెడ్డి సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. బిసిలపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తనకు ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుని పదవిని లేదా పార్టీ అధ్యక్ష పదవిని బిసికి కట్టబెట్టాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications