చిరుకు సిఎం యోగం, విజయమ్మ విజయఢంకా?

Chiranjeevi - YS Vijayamma
హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని వచ్చే ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. లోకసభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా గడువుకన్నా ముందే ఎన్నికలు జరిగవచ్చునని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అస్థిరత్వం వలన 2013 ఏప్రిల్, మే నెలల్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పెందుర్తి శ్రీ మహాకామేశ్వరి పీఠాధిపతి మహర్షి యద్దనపూడి అయ్యన్న పంతులు జోస్యం చెప్పారు.

ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఘోరంగా ఓడిపోతాయట. ఆదివారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ పీఠాధిపతి ఆ విషయాలు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ విజయమ్మ విజయదుందుభి మోగించి, రాష్ట్ర పగ్గాలు చేపడతారని అయ్యన్న పంతులు చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈ డిసెంబర్‌లో జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీచడం లేదని చెప్పారు. రాజకీయ సంక్షోభాలు, తెలంగాణ అల్లర్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తాయని ఆయన చెప్పారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ స్థానే చిరంజీవి కొద్ది మాసాలు సిఎం అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. ఈ సంవత్సరాంతం వరకూ రవాణా మార్గాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, విశాఖ రిఫైనరీలో కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని అయ్యన్న పంతులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+