రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నో సినిమా, నో పాలిటిక్స్: జెడి లక్ష్మీనారాయకు ఫ్లెక్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
సినిమా హీరోలకు, రాజకీయ నాయకులకు అభిమానులు ఫ్లెక్సీ కట్టి తమ అభిమానాన్ని చాటుకోవడం నిత్యకృత్యం. తాము అభిమానించే నేతలకు, హీరోలకు కూడళ్లలో, థియేటర్లలో అభిమానులు నిలువెత్తు కటౌట్లు పెడుతుంటారు. అయితే ఇప్పుడు సీన్ మారి పోయింది. ఓ అధికారికి ఫ్లెక్సీ పెట్టిన ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బహుశా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అధికారికి జేజేలు పలుకుతూ ఫ్లెక్సీలు వెలియడం ఇదే తొలిసారేమో.

అంతలా ప్రజలు అభిమానిస్తున్న ఆ హీరో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ. సంచలనాత్మక కేసుల్లో, సంచలనమైన తీరులో దర్యాప్తు నిర్వహిస్తున్న లక్ష్మీ నారాయణ, ఐపిఎస్. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ప్రజా చైతన్య వేదిక యువజన సంఘం ఇలాంటి ఫ్లెక్సీలు దాదాపు ఇరవై వరకు ఏర్పాటు చేసింది.

లక్ష్మీ నారాయణ బృందం సభ్యులను ఈ దశాబ్దపు నిజమైన హీరోలుగా అభివర్ణించింది. వీరికి మద్దతు పలుకుదాం! నిజాయితీపరులను ప్రోత్సహిద్దాం! దేశాన్ని రక్షిద్దాం! అంటూ యువతకు, మేధావులకు పిలుపునిచ్చింది! అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో సిబిఐ టీమ్‌కు మద్దతుగా దీనిని ఏర్పాటు చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న నాయకులను చెరసాలలో పెడుతున్న లక్ష్మీ నారాయణకు యువత సంపూర్ణ మద్దతివ్వాలని ఆయన అందులో కోరారు.

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసు, ఎమ్మార్ కేసు తదితరాలను దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుల దర్యాఫ్తు చేస్తున్న ఆయన రాష్ట్ర ప్రజలకు దాదాపు హీరోగా మారిపోయారనే చెప్పవచ్చు. కాగా జెడి లక్ష్మీ నారాయణకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి ఎదురుగానే జగన్‌కు సంఘీభావంగా ఆయన పార్టీ కార్యకర్తలు దీక్ష చేస్తుండటం గమనార్హం.

English summary
Fans of CBI Joint Director Laxmi Narayana were arranged a flexi in East Godavari district. Praja Chaithanya Vedhika Yuvajana Sangam arranged Laxmi Narayana flexi at Amalapuram gadiyaram centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X